కృష్ణా నది పుష్కరాలు ప్రత్యేకం -2016




కృష్ణా నది  పుష్కరాలు ప్రత్యేకం -2016
---------------------------------------------
కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగాకృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.చింతా రేవుల దగ్గర ఆంజనేయుడిని  దర్శించుకొని  తరువాత ఆలంపూర్ కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది.జోగులాంబ దేవి అభయం తీసుకోని  ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమలకొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరంబ దేవుల పాదాలు తాకి  దారిగుండా రక రకాల దేవతముర్తుల దర్శించుకుంటూ ప్రయాణిస్తుంది.నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి.ఆ తరువాతా  బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత చేరుతూ విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద వేణుగోపాల స్వామి కి ప్రణామములు చేస్తూ బంగాళాఖాతం లో కలుస్తుంది.
కృష్ణ నది తీరాన ఉన్న పుణ్య క్షేత్రాల వివరాలు

మరిన్ని దేవాలయాల వివరాల కోసం 

వీక్షించండి .

No comments

Copyright (C) 2014 Www.Manatemples.Net.. All Rights Reserved. Designed By Girish & Madhu. Powered by Blogger.